Header Banner

బిజీబిజీగా సీఎం చంద్రబాబు షెడ్యూల్! ఈరోజు పాల్గొననున్న ముఖ్య కార్యక్రమాలు ఇవే!

  Fri Apr 11, 2025 09:30        Politics

ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఏలూరు, కడప రెండు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఈ రెండు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్ర, శనివారాలు బిజీబిజీగా ఉండనున్నారు. ఏలూరు, కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. 10.20కి సీఎం చంద్రబాబుకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలకనున్నారు. పదిన్నరకు బీసీ వర్గాల ప్రజలతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు.

 

 ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

11:30కు ప్రజావేదిక వద్ద ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. 1 గంటకు టీడీపీ కేడర్‌తో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తారు. ఈ మీటింగులో పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. తిరిగి రెండున్నరకు హెలికాప్టర్‌లో బయలుదేరి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. మూడున్నరకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. నాలుగున్నరకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం ఐదు గంటలకు ఒంటిమిట్ట టీటీడీ గెస్ట్‌‌హౌస్‌కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు.

 

కోదండ రామస్వామికి సాయంత్రం 6 గంటల నుంచి 6:30 మధ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం చంద్రబాబు సమర్పిస్తారు. 6:45 నుంచి 8:30 వరకు సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొంటారు. 8:40కి తిరిగి టీటీడీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని.. అక్కడే రాత్రి బస చేస్తారు. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి విజయవాడ బయలుదేరుతారు. 10:30కు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CMChandrababu #ChandrababuNaidu #AndhraPradesh #APCM #CBNTour